తరచుగా అడుగు ప్రశ్నలు

ఈ Inspire తరగతులు అంటే ఏమిటి?

  • Inspire తరగతులు మీరు దేవునితో నడిచేందుకు సహాయపడటానికి రూపొందించబడినది. శిష్యరికాన్ని నేర్చుకోవాలనుకుంటున్నా, సంఘ కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నా, లేక దేవునితో అనుదిన జీవిత ఎదుగుదలకు దిశనిర్దేశము కోరుకుంటున్న వారి ప్రయాణములో సహయం చేయటానికి మరియు ప్రోత్సహించుటానికి ఈ తరగతులు రూపొందించబడినవి.

ఈ తరగతులను నేనెలా ప్రారంభించగలను?

  • సులువే! కేవలం పైన ఎడమవైపున ఉన్న "లాగిన్" పదముపైన నొక్కండి, "సైన్ అప్" అని ఉన్న చోట మీ సమాచారమును నింపి తరువాత "రిజిస్టర్" అని నొక్కితే మీ తరగతి మొదలైపోతుంది.

ఈ తరగతిని ప్రారంభించడానికి ముందు నాకేదైనా అవసరమా లేక దేనినైనా సిద్ధము చేసుకోవాలా?

  • లేదు, తరగతులకు అవసరమైన వాటన్నిటినీ అనగా అనుదిన బైబిలు పాట్యాంశములు, ఆడియో వనరులు మొదలైన వాటినన్నిటినీ సమకూర్చాము.

ఒక తరగతిని ఎలా ఎంచుకొనుట మరియు దానికి మరొక దానిని చేర్చుట చేయవచ్చును?

  • ఒక్కసారి లాగిన్ అయిన తరువాత మిగిలిన తరగతులు జోడించుట సులువే! మొదటి లాగిన్ పేజీలో వివిధ తరగతులను గురించిన విషయాలు ఉంటాయి వాటిలో నచ్చినది ఎంచుకుని ప్రారంభించవచ్చు!

ప్రతీ తరగతికి ఎంత కాలం నేను ఎంచుకోవచ్చు?

  • అందరూ ఒకేలా ఉండరు, త్వరగా నేర్చుకునేవారికి కూడా ఈ తరగతిలో నేర్చుకోడానికి ప్రతీ రోజు 15-30 నిమిషాలు పడుతుంది; వారు ఎంచుకున్న పాట్యాంశాలా ఆధారముగా. ఈ పాట్యాంశాలన్నిటినీ పూర్తిగా నేర్చుకొనుటకు అవసరమైనంత సమయాన్ని కేటాయించండి.

మరి క్విజ్ పరిస్థితేమిటి?

  • క్విజ్ లను మీకు మీరుగా పరీక్షించుకోవాలి, అవి మీరు నేర్చుకొనుటకు సహకరించు సాధనములు మాత్రమే. మీరేదైనా ప్రశ్న విడిచిపెడితే మరలా క్విజ్ లో పాల్గొనవచ్చు.

క్విజ్ లో మరలా పాల్గొనవచ్చా?

  • తప్పకుండా! మేరె క్విజ్ లో మరలా పల్గోనాలనుకున్తున్నారో దానిని వత్తితే అక్కడ పచ రంగులో తిరిగి పాల్గొనుటకు అవకాశమివ్వబడుతుంది

ఒకే తరగతిని మళ్ళీ తీసుకోవచ్చా?

  • కచ్చితంగా! నీకు ఎన్ని సార్లు అవసరమనిపిస్తే అన్ని సార్లు ఒకే తరగతిని తీసుకోవచ్చు. అవి క్రీస్తుతో నీ సంబంధము పెంపొందించుకొనుటకు మరియు నేర్చుకొనుటకు ఉపకరించే సాధనములే.

ఎక్కువ తరగతులను ఎంచుకోవచ్చా?

  • అవును, మా టీమువారు నిరంతరమూ మీకు నూతన విషయాలను నూతన గుణకాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనప్పుడల్లా మీము నూతన శీర్షికలను మరియు తరగతులను పట్టికలో చేర్చుతుంటాము.

మీకున్న ప్రశ్నలు కనబడకుంటే? మాకు పంపించండి!